మహిళల్లో ట్రాక్షన్ అలోపేసియా.. వేగంగా బట్టతల
- గుంటూరులో ఐఏ డీవీఎల్ ఏపీ శాఖ 43వ వార్షిక వైద్య సదస్సు
- పాల్గొన్న ముంబై హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ రచితా దురత్
- మహిళలు గట్టిగా లాగి బిగుతుగా జడ వేసుకోవడం వల్ల ట్రాక్షన్ అలోపేసియా
- పోషకాహార లోపం, మానసిక ఆందోళన, ఒత్తిడే కారణమన్న డాక్టర్ రచిత
ఒత్తిడి, జీవనశైలి కారణంగా మహిళల్లోనూ వేగంగా బట్టతల వస్తున్నట్టు ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ రచితా దురత్ తెలిపారు. గుంటూరులో జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజీ, వెనిరియాలజీ, లెప్రాలజీ (ఐఏ డీవీఎల్) ఆంధ్రప్రదేశ్ శాఖ 43వ వార్షిక వైద్య సదస్సులో భాగంగా నిన్న నిర్వహించిన ‘ఏపీ క్యూటికాన్ 2024’లో ‘బట్టతల సమస్య పరిష్కారానికి ఆధునిక చికిత్సలు-వాటి సామర్థ్యం’ అన్న అంశంపై డాక్టర్ రచిత మాట్లాడారు.
యువతులు, మహిళల్లో వేగంగా జుట్టు రాలడం వంటి సమస్య ఆందోళన కలిగిస్తున్నట్టు చెప్పారు. ఒత్తిడి, మానసిక ఆందోళన, పౌష్టికాహార లోపం, జన్యుపరమైన అంశాలు వంటివి మహిళ్లలో ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్ హెడ్ సమస్యకు కారణం అవుతున్నట్టు తెలిపారు. గట్టిగా లాగి బిగుతుగా జడ వేసుకోవడం వల్ల ట్రాక్షన్ అలోపేసియా సమస్య ఏర్పడి నుదురు భాగంలో జుత్తు రాలిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో ఈ సమస్య నివారణకు ట్రాపికల్ స్టెరాయిడ్స్ వాడేవారని, అయితే మినాక్సిడిల్ ఔషధాన్ని తక్కువ మోతాదులో వాడడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని చెప్పారు.