'నా కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే అత్యంత క‌ష్ట‌మైన సాంగ్‌'.. 'పీలింగ్స్'పై ర‌ష్మిక స్పంద‌న‌.. బ‌న్నీ ఏమ‌న్నారంటే..!

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 'పుష్ప-2: ది రూల్'
  • డిసెంబరు 5న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న సినిమా
  • తాజాగా ఈ చిత్రం నుంచి 'పీలింగ్స్' అంటూ సాగే మాస్ మసాలా సాంగ్ రిలీజ్‌
  • ఈ పాటలో బన్నీ, ర‌ష్మిక ఫుల్‌ ఎనర్జటిక్ స్టెప్పులు
  • 'పీలింగ్స్' సాంగ్ ఫుల్ వైబ్‌, ఫుల్ మాస్ అంటూ ర‌ష్మిక ట్వీట్‌
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మేనియా కొన‌సాగుతోంది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప-2: ది రూల్' చిత్రం డిసెంబరు 5న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'పీలింగ్స్' అంటూ సాగే పక్కా మాస్ మసాలా సాంగ్ విడుద‌లైన విష‌యం తెలిసిందే. 

ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత‌ చంద్రబోస్ సాహిత్యం అందించిన‌ ఈ పాట ఆరంభంలో వచ్చే మలయాళ లిరిక్స్ ను సిజు తురావూర్ రచించారు. ఈ పాటలో బన్నీ, ర‌ష్మిక ఫుల్‌ ఎనర్జటిక్ స్టెప్పులు వేశారు. ఈ సాంగ్‌పై హీరోయిన్ ర‌ష్మిక 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. త‌న కెరీర్‌లోనే ఇప్ప‌టి వ‌ర‌కూ ఇదే అత్యంత క‌ష్ట‌మైన సాంగ్ అని ఆమె ట్వీట్ చేశారు. 

"పీలింగ్స్ సాంగ్ ఫుల్ వైబ్‌, ఫుల్ మాస్‌. నేను ఇప్పటివరకు చేసిన అత్యంత కష్టతరమైన పాట ఇదే. న‌న్ను ఎవ‌రైనా ఎత్తుకుంటే నాకు చాలా భ‌యం. అల్లు అర్జున్ సార్ వ‌ల్ల ఆ భ‌యాన్ని దాటాను. చాలా క‌ష్ట‌మైన పాట కానీ ఎంజాయ్ చేశాను. సార్‌తో ఈ పాట చేయడం చాలా కష్టం కానీ సరదాగా గ‌డిచిపోయింది. ఈ సాంగ్ మీచేత థియేట‌ర్ల‌లో చిందులు వేయించ‌డం ఖాయం" అంటూ ర‌ష్మిక ట్వీట్ చేశారు. 

ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన బ‌న్నీ.. 'యూ రాక్డ్' అని బ‌దులిచ్చారు. కాగా, ఇప్పుడీ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. విడుద‌లైన గంట‌లోనే 2 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సాధించ‌డం విశేషం. ఇక 'పుష్ప-2: ది రూల్' అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ల ధ‌ర‌ల పెంపున‌కు అనుమ‌తినిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టికెట్ల ధ‌ర‌లు భారీగా పెరిగాయి.   


More Telugu News