నాగబాబు ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌.. ఎవ‌ర్ని ఉద్దేశించోనంటూ నెట్టింట చ‌ర్చ‌!

   
జ‌న‌సేన నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట ఆస‌క్తిని రేపుతోంది. దాంతో ఆయన ఈ ట్వీట్ ఎవ‌ర్ని ఉద్దేశించి చేశారోనంటూ నెట్టింట చ‌ర్చ న‌డుస్తోంది. నాగబాబు త‌న ట్వీట్‌లో స్వామి వివేకానంద కొటేష‌న్‌ను ప్ర‌స్తావించ‌డం మ‌నం చూడొచ్చు. 

"నువ్వు త‌ప్పుడు దారిలో వెళ్తున్నావ‌ని నువ్వే గుర్తిస్తే వెంట‌నే నీ దారిని మార్చుకో. నువ్వు ఆల‌స్యం చేసే కొద్దీ, నువ్వు నిజంగా ఎక్క‌డి వాడివో అక్క‌డికి వెళ్ల‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంది" అని స్వామి వివేకానంద కోట్‌ను నాగ‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఆయ‌న ఎవ‌ర్ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారోనంటూ ట్వీట్ కింద కామెంట్ల‌లో చ‌ర్చ న‌డుస్తోంది. 


More Telugu News