ఏపీలో కొత్త రేష‌న్ కార్డులు.. ఎప్ప‌ట్నుంచంటే..!

  • పాత రేష‌న్‌కార్డులలో మార్పులు, చేర్పుల‌కు అవ‌కాశాన్ని క‌ల్పించిన కూట‌మి ప్ర‌భుత్వం
  • అలాగే కొత్త కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం
  • ఈ నెల 2 నుంచి 28 వ‌ర‌కు గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేష‌న్‌కార్డుల జారీ 
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో రేష‌న్‌కార్డులపై వైసీపీ రంగుల‌తో పాటు అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్ బొమ్మ ముద్రించిన విష‌యం తెలిసిందే. దాంతో ఇప్ప‌టి కూట‌మి ప్ర‌భుత్వం పాత రేష‌న్‌కార్డులలో మార్పుల‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రేష‌న్‌కార్డుల్లో మార్పులు, చేర్పుల‌తో పాటు కొత్త కార్డుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాన్ని ప్ర‌భుత్వం క‌ల్పించింది. 

ఇవాళ్టి నుంచి ఈ నెల 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డం జ‌రుగుతుంది. గ్రామ‌/వార్డు స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేష‌న్‌కార్డులు జారీ చేస్తారు. ఇప్ప‌టివాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వ‌నున్నారు. దీనికి సంబంధించి బ‌డ్జెట్ కూడా ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. 


More Telugu News