రోహిత్ శర్మ కుమారుడి పేరు ఇదే... వెల్లడించిన రితికా
- నవంబరు 15న రోహిత్ శర్మ-రితికా సజ్జే దంపతులకు మగబిడ్డ
- అహాన్ అని నామకరణం
- సోషల్ మీడియాలో మరోసారి బజ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటీవలే పుత్రోదయం కలిగిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ అర్ధాంగి రితికా సజ్దే నవంబరు 15న ముంబయిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
కాగా, తమ బిడ్డకు పేరు పెట్టినట్టు రితికా తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించింది. తమ కుమారుడికి 'అహాన్' అనే నామకరణం చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తనయుడి పేరును రివీల్ చేసింది.
రోహిత్, రితికా సజ్దేలకు 2015 డిసెంబరు 13న వివాహం జరిగింది. అంతకుముందు వీరిద్దరూ సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇక, 2018 డిసెంబరు 30న తొలి సంతానం 'సమైరా' పుట్టింది. ఇప్పుడు అబ్బాయి పుట్టడంతో తాము నలుగురం అయ్యామని ఇటీవలే రితికా పోస్టు పెట్టింది. ఇప్పుడు ఆ బిడ్డకు నామకరణం చేయడంతో సోషల్ మీడియాలో మరోసారి బజ్ నెలకొంది.