కకాటూ చిలుకతో నర్సుల డ్యాన్స్​... వైరల్​ వీడియో ఇదిగో!

  • చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి చిలుకను తీసుకొచ్చిన యజమాని
  • దానికి చికిత్స చేసే ముందు ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సిబ్బంది
  • దాని నడకకు తగినట్టుగా డ్యాన్స్ చేస్తూ అలరించిన తీరు
ఒక కకాటూ చిలుక, దానితో పాటు నర్సులు చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చిలుక జాతికి చెందిన పక్షి కకాటూ. అలాంటి ఆ అందమైన పక్షిని పెంచుకుంటున్న యజమాని... దాన్ని చికిత్స కోసం వెటర్నరీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. దానికి చికిత్స చేసే ముందు ఆస్పత్రి సిబ్బంది దాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో కకాటూ చిలుక నడకకు, డ్యాన్స్ కు తగినట్టుగా నర్సులు, ఇతర సిబ్బంది డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ లో వైరల్ గా మారింది. పక్షి డ్యాన్స్, దానికి తగ్గట్టు ఆస్పత్రి సిబ్బంది చేసిన డ్యాన్స్ భలే బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియోను పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే ఏకంగా లక్ష వరకు వ్యూస్ రావడం గమనార్హం.


More Telugu News