అన్నా... అన్నా అని పిలిచేవాడివి... కార్యకర్త ఆత్మహత్యపై నారా లోకేశ్ ఆవేదన
- శ్రీను అనే కార్యకర్త ఆత్మహత్య
- కదిలిపోయిన నారా లోకేశ్
- ఆపద వచ్చినప్పుడు ఈ అన్న గుర్తుకు రాలేదా అంటూ భావోద్వేగం
శ్రీను అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. భావోద్వేగాలతో స్పందించారు. "అన్నా... అన్నా అని పిలిచేవాడివి... ఏ కష్టం వచ్చినా సాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి... నీకు ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలని అనిపించలేదా? దిద్దలేని పెద్ద తప్పు చేశావు తమ్ముడూ... ఐ మిస్ యూ" అంటూ లోకేశ్ విచారం వెలిబుచ్చారు.
"నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని తెలిసి నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు! ఓ అన్నగా నీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. ఎవరికి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచుకుందాం. బతికే ఉందాం... మరో నలుగురిని బతికిద్దాం" అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.