తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని మోదీ అన్నారు: కిషన్ రెడ్డి
- ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని మోదీ సూచించారని వెల్లడి
- రుణమాఫీ అరకొర చేసి అంతా చేసినట్లు చెబుతోందని కాంగ్రెస్‌పై ఆగ్రహం
- ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనడానికి లోక్ సభ ఎన్నికలే నిదర్శనమని వ్యాఖ్య
తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను కలిసిన సందర్భంలో తెలంగాణపై ప్రధాని ఆశాభావంతో ఉన్నారన్నారు. ప్రజల తరఫున తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేయాలని ప్రధాని పిలుపునిచ్చినట్లు చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళతామన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కిషన్ రెడ్డి ఆధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ ప్రజాస్వామ్యబద్ధంగా పని చేసే పార్టీ అన్నారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థలకు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. నిధులు కేంద్రం నుంచి వస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో అరకొర రుణమాఫీ చేసి మొత్తం చేశామని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు నోటిఫికేషన్లు కూడా విడుదల చేయలేదన్నారు. గత ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారనడానికి లోక్ సభ ఎన్నికలే నిదర్శనమన్నారు.