ఇరాక్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేసిన ఇజ్రాయెల్
- ఇరాక్ వైపు నుంచి దూసుకొచ్చిన రెండు డ్రోన్లు
- నేవీ మిస్సైల్ బోటు సాయంతో కూల్చివేశామన్న ఇజ్రాయెల్
- సురక్షిత ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి రావద్దని ప్రజలకు హెచ్చరిక
ఇజ్రాయెల్ పై ఇరాక్ డ్రోన్లతో దాడి చేసింది. ఇరాక్ వైపు నుంచి రెండు డ్రోన్లు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు తెలిపారు. అయితే మధ్యధరా సముద్రంలో నేవీ మిస్సైల్ బోటు సాయంతో వాటిని తమ మిలిటరీ బలగాలు కూల్చివేశాయని చెప్పారు. ఇటీవల ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు ఓ అనుమానిత డ్రోన్ వచ్చిందని... ఆ డ్రోన్ ను కూడా తమ వైమానికి దళం కూల్చివేసిందని తెలిపారు.
మరోవైపు యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన లెబనాన్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు... ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య కాల్పుల విరామం నేపథ్యంలో... సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. కాల్పుల విరామం ఒప్పందం అమల్లోకి వచ్చినా నేటికీ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో లెబనాన్ దక్షిణ భాగంలోని సరిహద్దు ప్రాంత ప్రజలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణకు సంబంధించి తదుపరి నివేదిక వచ్చేంత వరకు సొంత గ్రామాలకు తిరిగి రావద్దని హెచ్చరించింది.