ఫడ్నవీస్ కాకుండా... మహారాష్ట్ర సీఎం పదవి కోసం తెరపైకి కొత్త పేరు!
- మురళీధర్ పేరును పరిశీలిస్తోందంటూ జోరుగా ప్రచారం
- సీఎం రేసులో తాను ఉన్నాననేది వట్టి ప్రచారమేనన్న మురళీధర్
- ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగిస్తారంటూ వార్తలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది. ముఖ్యమంత్రి రేసులో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు బీజేపీ పుణే ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహల్ పేరు వినిపిస్తోంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా మోహల్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ ప్రచారంపై స్వయంగా కేంద్రమంత్రి స్పందించారు. సీఎం రేసులో తన పేరు ఉందంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అవన్నీ కేవలం ఊహాగానాలే అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేది సోషల్ మీడియా కాదని... బీజేపీ పార్లమెంటరీ బోర్డు తేలుస్తుందన్నారు. ఫడ్నవీస్ నేతృత్వంలో మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ పోరాడి అద్భుత విజయం సాధించిందన్నారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పును ఇచ్చారని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి బీజేపీ విముఖత చూపిస్తోంది. దీంతో తెరపైకి ఫడ్నవీస్‌తో పాటు మురళీధర్, వినోద్ తావ్డే, రాధాకృష్ణ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తుందని వార్తలు వస్తున్నాయి. సీఎం కోసం మరొకరి పేరును పరిశీలించే క్రమంలో ఫడ్నవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.