ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… సీఎం రేవంత్ రెడ్డి వైరల్ ట్వీట్

  • ఓటుతో రైతన్న చరిత్ర తిరగరాశాడని సీఎం పొగడ్త
  • మార్పు కోసం వేసిన ఓటు అభయహస్తంగా మారింది..
  • రైతుల జీవితాల్లో పండుగను తెచ్చిందని వ్యాఖ్య
సరిగ్గా ఏడాది క్రితం తెలంగాణ రైతన్న తన ఓటుతో చరిత్రను తిరగరాశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు మార్పు కోసం పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటేశాడని, ఆ ఓటు అభయహస్తమై రైతుల జీవితాల్లో పండగను తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఏడాది పాలన సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన పండుగను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు విజయోత్సవాలకు హాజరవుతున్నట్లు సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. 

ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ.. రూ.7,625 కోట్ల రైతు భరోసా.. ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్.. రూ.10,444 కోట్ల ఉచిత విద్యుత్.. రూ.1433 కోట్ల రైతుబీమా.. రూ.95 కోట్ల పంట నష్ట పరిహారం.. రూ.10,547 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క ఏడాదిలోనే రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని చెప్పారు. ఇది కేవలం నెంబర్ మాత్రమే కాదని, రైతులు కాంగ్రెస్ పై పెట్టుకున్న నమ్మకమని అన్నారు. ఈ సంతోషాన్ని రైతులతో కలిసి పంచుకునేందుకు ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ రేవంత్ రెడ్డి ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.


More Telugu News