సోష‌ల్ మీడియాలో 'నానా హైరానా' పాట ప్ర‌భంజ‌నం.. 'బిగ్గెస్ట్ మెలోడీ ఆఫ్ ది ఇయ‌ర్' అంటూ మేక‌ర్స్ ట్వీట్‌!

  • రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో 'గేమ్ ఛేంజ‌ర్‌'
  • జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
  • ఇటీవ‌ల మూవీలోని 'నానా హైరానా' అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుద‌ల‌
  • 35 మిలియ‌న్లకు పైగా వ్యూస్‌తో ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.01 ట్రెండింగ్‌
గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్‌'. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్స్ ఇస్తూ చిత్రంపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 28న 'నానా హైరానా' అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుద‌ల చేశారు. 

ప్ర‌ముఖ సింగ‌ర్లు శ్రేయ ఘోష‌ల్‌, కార్తీక్ పాడిన ఈ పాట శ్రోతల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా 'నానా హైరానా' పాట లిరిక‌ల్ వీడియో ఏకంగా 35 మిలియ‌న్ల వ్యూస్ దాటింది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో నెం.01 ట్రెండింగ్‌లో కొన‌సాగుతోంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ మెలోడీ సాంగ్‌గా నిలిచింది. 

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. దీంతో మెగా అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. త‌మ అభిమాన‌ హీరో సినిమా విడుద‌ల త‌ర్వాత‌ ప్రభంజ‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని కామెంట్లు పెడుతున్నారు. 


More Telugu News