పొద్దున్నే ఇలా చేస్తే.. బరువు తగ్గడం ఈజీ!
- ఉదయపు ఎండలో వాకింగ్ తో ఎంతో ప్రయోజనం
- పరగడపునే కాసిన్ని నీళ్లు, వ్యాయామం చేస్తే బెటర్
- బరువు చూసుకోవడానికీ అదే తగిన సమయం
బరువు తగ్గాలనుకునే వారు... డైటింగ్ పేరిట నోరు కట్టేసుకుంటారు. ఉదయం, సాయంత్రం జిమ్ లోనో, బయటనో వ్యాయామాలతో కుస్తీపడుతుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతోనే బరువు తగ్గించుకోవడానికి వీలవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ వ్యాయామం, డైటింగ్ తో పాటు వీటిని కూడా అలవర్చుకుంటే బరువు తగ్గాలనుకునే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోవచ్చని వివరిస్తున్నారు.
పరగడపునే నీళ్లు తాగండి
రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకట్రెండు గ్లాసులు నీళ్లు తాగాలి. ఇలా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రమవుతుంది. ఆకలి కాస్త నియంత్రణలోకి వస్తుంది. తర్వాత ఆహారం తీసుకుంటే సులువుగా జీర్ణమవుతుంది. శరీరంలో జీవక్రియలు వేగం పుంజుకుని బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
అల్పాహారానికి ముందే వ్యాయామం చేయండి
యుక్త వయసులో ఉన్నవారు అల్పాహారం తీసుకోవడానికి ముందే వ్యాయామం చేయాలి. అదే మధుమేహంతో బాధపడుతున్నవారుగానీ, పెద్ద వయసువారుగానీ స్వల్పంగా అల్పాహారం తీసుకుని... కొంత సమయం తర్వాత వ్యాయామం చేయాలి. దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముందే బరువు చూసుకోండి
బరువు తగ్గాలనుకునే వారు... ఎప్పుడైనా ఉదయం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత బరువు చెక్ చేసుకోవాలి. ఆ సమయంలో కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి సరైన బరువు ఎంతో తెలుస్తుంది. బరువు తగ్గిన విషయం తెలిస్తే... వ్యాయామం చేయడానికి మరికాస్త ఉత్సాహం వస్తుంది. బరువు తగ్గకపోతే... సమస్య ఎక్కడుందో గుర్తించి, పకడ్బందీగా ప్రయత్నించే అవకాశం చిక్కుతుంది.
కాసేపు ఎండలో వాకింగ్ చేయండి
ఉదయమే శరీరానికి కాస్త ఎండ తగిలితే మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని నిపుణులు చెబుతున్నారు. ఉదయపు ఎండలో యూవీ రేడియేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి చర్మానికి హాని చేయదు. పైగా చర్మం విటమిన్ డి తయారు చేసుకోవడానికి సూర్యరశ్మి తోడ్పడుతుంది. వాకింగ్ వల్ల వ్యాయామమూ అవుతుంది.
పోషకాహారం ఉండే అల్పాహారం...
ఉదయమే తీసుకునే అల్పాహారంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగిన శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఉదయం అల్పాహారంలో పెసర, వేరుశనగ వంటివాటితోపాటు గుడ్లు, పెరుగు వంటివి ఉంటే మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
బాగా నమిలి తినండి
అల్పాహారాన్ని నెమ్మదిగా, బాగా నమిలి తినండి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణమై శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. బాగా నమిలి తినడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం కాబట్టి బరువు తగ్గేందుకూ తోడ్పడుతుంది. అదే టీవీ చూస్తూనో, ఫోన్ చూస్తూనో తింటే తెలియకుండా ఎక్కువగా తినేస్తారు. బరువు తగ్గే లక్ష్యం నీరుగారిపోతుంది.