అమెజాన్ లో నేటి నుంచే మరో బంపర్ సేల్

  • అమెజాన్ లో బ్లాక్ ఫ్రైడే సేల్
  • నవంబరు 29 నుంచి డిసెంబరు 2 వరకు డిస్కౌంట్ సేల్
  • పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 10 శాతం వరకు డిస్కౌంట్ 
ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లో మరో బంపర్ సేల్ కు తెరలేచింది. నేటి (నవంబరు 29) నుంచి డిసెంబరు 2 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ నిర్వహిస్తున్నారు. పలు బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలు ప్రకటించారు. 

మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాప్ లు, ఫ్యాషన్ ఉపకరణాలపై ఆఫర్లు ఇస్తున్నారు. హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుండగా... ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.


More Telugu News