భారీ లాభాలతో వారాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు
- 759 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 216 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ భారతీ ఎయిర్ టెల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈ రోజు ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు... ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. రిలయన్స్, ఎయిర్ టెల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 759 పాయింట్లు లాభపడి 79,802కి చేరుకుంది. నిఫ్టీ 216 పాయింట్లు పెరిగి 24,131 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతీ ఎయిర్ టెల్ (4.30%), సన్ ఫార్మా (2.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.38%), అదానీ పోర్ట్స్ (1.94%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.78%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.23%), నెస్లే ఇండియా (-0.07%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.05%).