పాలమాకుల గ్రామంలో సోనూసూద్ సందడి
- కస్తూర్భా గురుకుల పాఠశాల సందర్శన
- విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందిస్తానని హామీ
- పాఠశాలల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపు
పంజాబ్ లో పుట్టిపెరిగినా కూడా తెలంగాణ ప్రజలను తన కుటుంబ సభ్యులలాగా భావిస్తానని ప్రముఖ నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పాలమాకుల గ్రామంలో శుక్రవారం నాడు సందడి చేశారు. గ్రామంలోని కస్తూర్భా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ, సెల్ఫీలు దిగుతూ పాఠశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తాను పంజాబ్ కు చెందిన వాడినే అయినా తెలుగు ప్రజలు కూడా తన కుటుంబ సభ్యులేనని చెప్పారు.
ఈ సందర్భంగా పాఠశాలను తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన సిద్ధూ రెడ్డిని సోనూసూద్ అభినందించారు. సిద్ధూరెడ్డి తన సోదరుడిలాంటి వాడని, స్కూలును అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని అన్నారు. సిద్ధూ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలల అభివృద్ధి కోసం సొసైటీలోని వ్యక్తులు ముందుకు రావాలని సోనూసూద్ పిలుపునిచ్చారు. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని సోనూసూద్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.