సినీ నటుడు సుబ్బరాజు భార్య స్రవంతి ఎవరంటే..!

  • అమెరికాలో సింపుల్ గా జరిగిన సుబ్బరాజు, స్రవంతి వివాహం
  • ఫ్లోరిడాలో డెంటిస్ట్ గా పని చేస్తున్న స్రవంతి
  • చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడిన స్రవంతి కుటుంబం
సినీ నటుడు సుబ్బరాజు ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల వయసులో స్రవంతి అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో చాలా సింపుల్ గా హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, అతి కొద్దిమంది మిత్రుల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజెన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  

మరోవైపు సుబ్బరాజు భార్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయమై పలువురు ఆరా తీస్తున్నారు. సుబ్బరాజు భార్య స్రవంతికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవే. చాలా ఏళ్ల క్రితమే స్రవంతి కుటుంబం అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడింది. కొలంబియా యూనివర్శిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నుంచి స్రవంతి బీడీఎస్, డీడీఎస్, ఎంపీహెచ్ చేశారు. ప్రస్తుతం ఫ్లోరిడాలోని నార్త్ వుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా పని చేస్తున్నారు. 

సుబ్బరాజు సహజంగానే ఆడంబరాలకు దూరంగా ఉంటారు. అందుకే తన పెళ్లిని కూడా సింపుల్ గా చేసుకున్నారు. పెళ్లి అమెరికాలో జరిగినప్పటికీ... హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు సుబ్బరాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


More Telugu News