మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి: డోలా బాల వీరాంజనేయ స్వామి
- వైసీపీ నేతలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్న డోలా
- తప్పు చేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదని వ్యాఖ్య
- విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపణ
వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఎన్నో దారుణాలకు పాల్పడ్డారని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. విపక్షాలకు చెందిన కార్యకర్తలు మాట్లాడేందుకు కూడా భయపడేవారని... అప్పుడు మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పారు. తప్పులు చేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడుస్తోందని... ఇప్పటి వరకు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సెకీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పారు. నష్ట నివారణ కోసమే వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.