బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ అరెస్ట్‌పై స్పందించిన పవన్ కల్యాణ్

  • హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై బంగ్లా ప్రధాని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • బంగ్లాదేశ్ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న పవన్ కల్యాణ్
  • పాలస్తీనాలో జరిగితే అందరూ స్పందిస్తారని చురక
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ గురువు చిన్మయి కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఢిల్లీలో ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ హిందూ మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై అక్కడి ప్రధాని మహమ్మద్ యూనస్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అక్కడ (బంగ్లాదేశ్)లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పాలస్తీనాలో ఏదైనా జరిగితే ప్రతి ఒక్కరు స్పందిస్తారని, కానీ బంగ్లాదేశ్ మైనార్టీలపై దాడులు జరిగినప్పుడు ఎవరూ స్పందించడం లేదన్నారు. ఇస్కాన్ గురువు అరెస్టును నిరసిస్తూ అందరం కలిసికట్టుగా పోరాడుదామని అంతకుముందు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 


More Telugu News