లాభాల్లో ముగిసిన మార్కెట్లు... భారీగా లాభపడ్డ అదానీ పోర్ట్స్

  • 230 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 80 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా లాభపడ్డ అదానీ పోర్ట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్-హిజ్బొల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం మార్కెట్లకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 230 పాయింట్లు లాభపడి 80,234కి చేరుకుంది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 24,274 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ పోర్ట్స్ (6.29%), ఎన్టీపీసీ (2.09%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.43%), బజాజ్ ఫైనాన్స్ (1.28%), మారుతి (1.24%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-0.77%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.61%), సన్ ఫార్మా (-0.59%), ఏషియన్ పెయింట్స్ (-0.58%).


More Telugu News