వారంతా జైలుకు వెళ్లడం ఖాయం: రఘురామకృష్ణరాజు
- సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ అరెస్టును స్వాగతించిన ఆర్ఆర్ఆర్
- కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్య
- సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచన
ఏపీ సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయ్‌పాల్ అరెస్టును స్వాగతించిన ఆర్ఆర్ఆర్... కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు.
ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు సీఐడీ మాజీ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. కాగా, ఆర్ఆర్ఆర్ను కస్టడీలో వేధించిన కేసులో మంగళవారం విజయ్‌పాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఒంగోలు తాలుకా పీఎస్‌లోనే ఉన్నారు.
ఈరోజు ఆయన్ను గుంటూరు తరలించనున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించి, గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు విజయ్‌పాల్ బెయిల్ పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.