ఇక ఓటీటీలో రిలీజైన సినిమాలకు కూడా ఫిలింఫేర్ అవార్డులు

  • ఇక ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లకూ ఫిలింఫేర్ అవార్డులు
  • ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్ విడుదల
  • అత్యధిక నామినేషన్స్‌లో హీరామండి
ప్రతి ఏటా విడుదలైన సినిమాలలో అద్భుత నటన కనబర్చిన నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు బహూకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓటీటీలో విడుదలైన సినిమాలకు కూడా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తుంది. ఎందుకంటే కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా వివిధ కేటగిరిల్లో పోటీ పడే సిరీస్‌లు, సినిమాల నామినేషన్ లిస్ట్‌ను ఫిల్మ్‌ఫేర్ విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి:ది డైమండ్ బజార్’ 16 కేటగిరీస్‌లో నామినేట్ అయింది. ముఖ్య విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాలు, నటీనటులు, దర్శకుల వివరాలు ఒకసారి చూస్తే..

ఉత్తమ సిరీస్ నామినేషన్స్:  కాలా పానీ, కోట ఫ్యాక్టరీ (సీజన్ 3), మేడ్ ఇన్ హెవెన్ (సీజన్ 2), ముంబయి డైరీస్ (సీజన్ 2), ది రైల్వేమెన్
 
ఉత్తమ నటి నామినేషన్స్: హ్యూమా ఖురేషి (మహారాణి సీజన్ – 3). కొంకణ సేన్ శర్మ (ముంబాయి డైరీస్ -3), మనీషా కొయిరాలా (హీరామండి:ది డైమండ్ బజార్), శోభిత ధూళిపాళ్ల (మేడ్ ఇన్ హెవెన్ 2), సోనాక్షి సిన్హా (హీరామండి: ది డైమండ్ బజార్), సుస్మిత సేన్ (తాళి).
 
ఉత్తమ దర్శకుడు నామినేషన్స్: అభిషేక్ చౌబే (కిల్లర్ సూప్), నిఖిల్ అడ్వాణీ (ముంబయి డైరీస్ 2), ప్రతీశ్ మెహతా (కోటా ఫ్యాక్టరీ – సీజన్ 3), రాజ్ అండ్ డీకే (గన్స్ అండ్ గులాబ్స్), సమీర్ సక్సేనా,అమిత్ గోలానీ (కాలా పానీ), సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి:ది డైమండ్ బజార్), శివ రౌలి (ది రైల్వేమెన్).

ఉత్తమ నటుడు నామినేషన్స్: అర్జున్ మాథూర్ (మేడ్ ఇన్ హెవెన్ – సీజన్ 2), గగన్ దేవ్ రియా (స్కామ్ 2003 ది తెల్గీ స్టోరీ), కేకే మేనన్ (బొంబయ్ మేరీ జాన్), ప్రియాన్షు పైనులి (శేఖర్ లఖోట్), రితేశ్ దేశ్‌ముఖ్ (పిల్), సూర్య శర్మ (ఉండేఖి – సీజన్ 3).


More Telugu News