నేనేమీ వణికిపోవడం లేదు.. కేసులకు భయపడటం లేదు.. ఆర్జీవీ సంచలన వీడియో!
- తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వీడియో విడుదల చేసిన ఆర్జీవీ
- తన సోషల్ మీడియా పోస్టులు 'ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట..' అంటూ వర్మ వ్యంగ్యాస్త్రాలు
- ప్రస్తుతం సినిమా పనిలో బిజీగా ఉండడంతోనే విచారణకు రాలేదని వివరణ
తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలో దెబ్బతీశాయట అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా.. ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. చట్టంలోని సెక్షన్లను ఒక పద్దతి ప్రకారం వాడటం లేదని ఆయన ఆరోపించారు. పవర్లో ఉన్నా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా సెక్షన్లను మార్చుకుని కేసులు బనాయించడం చేస్తున్నాయన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న తంతుగా ఆయన పేర్కొన్నారు. యూరప్, అమెరికా సహా భారత్‌లోనూ ఇదే జరుతుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. కానీ, ప్రతిదానికి ఒక పధ్ధతి ఉంటుందని తెలిపారు.
ఇక ప్రస్తుతం తాను ఓ మూవీ షూటింగ్లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పుడో ఒక ఏడాది క్రితం చేసిన ట్వీట్స్ కేసును ఒక వారంలో పూర్తి చేయాలని చూడడం ఎంతవరకు సబబు? అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసును ఇంత హడావిడిగా విచారించాల్సిన అవసరం ఏంటో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు.
హత్య, అత్యాచారాలు వంటి కేసులనే ఏళ్లకు ఏళ్లు తీసుకుంటున్న ప్రస్తుత సమయంలో.. తనకు సంబంధించిన ఈ చిన్న కేసును ఇలా చేయడం ఏంటని వర్మ ప్రశ్నించారు. అయితే, తనకు వచ్చిన నోటీసులకు తాను సమాధానం ఇచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్మకు ఒంగోలు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
రెండుసార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ, ఆయన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వర్మ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.