ఈ కుర్రాడిలో టాలెంట్ ఉంది.... అందుకే తీసుకున్నాం: రాహుల్ ద్రావిడ్

  • ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్ రఘువంశీని కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్
  • అత్యంత పిన్న వయస్కుడైన క్రీడాకారుడిగా వైభవ్ గుర్తింపు 
  • రఘువంశీలో మంచి నైపుణ్యం ఉందన్న రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అత్యంత పిన్న వయస్కుడైన వైభవ్ సుర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో సూర్యవంశీ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంకు రాగా, ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని తీసుకునేందుకు తొలుత ఆసక్తికనబర్చింది. 

ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రూ.1.10కోట్లకు తీసుకుంది. వైభవ్ బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన యువ క్రీడాకారుడు. ప్రస్తుతం ఈ యువకుడు 8వ తరగతి చదువుతున్నాడు.  

కాగా, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతన్ని తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు. వైభవ్ లో మంచి నైపుణ్యం ఉందని, ట్రయల్స్ కోసం వచ్చిన అతన్ని చూడడం ఆనందంగా ఉందన్నాడు. ట్ర‌య‌ల్స్‌లో అత‌ని చ‌క్క‌టి బ్యాటింగ్ నైపుణ్యం త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని తెలిపాడు. రాబోయే సీజన్‌లో జట్టును గెలిపించే స‌త్తా ఆ కుర్రాడిలో ఉంద‌ని ద్రావిడ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. 

ఇక 13 ఏళ్ల వైభవ్ ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌ అండర్-19 టెస్ట్‌ మ్యాచ్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. కేవ‌లం 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు.  


More Telugu News