ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన
- కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు కౌంటర్‌గా బీజేపీ నిరసనలు
- ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని బీజేపీ నిరసన కార్యక్రమాలు
- కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్‌తో బీజేపీ నిరసన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది అవుతోంది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్ విజయోత్సవాలకు బీజేపీ కౌంటర్‌గా '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని చెబుతూ ఈ తరహా నిరసనలకు సిద్ధమైంది.
ఈ నెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. ఒక్కోరోజు ఒక్కో విధంగా నిరసన తెలపనుంది. ఈ నెల 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జిషీట్, డిసెంబర్ 1న జిల్లాస్థాయిలో బీజేపీ ఛార్జిషీట్, డిసెంబర్ 2, 3 తేదీల్లో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. నిరసన చేపడుతున్న ఈ వారం రోజులు ప్రతిరోజు... ప్రతి నియోజకవర్గ కేంద్రంలో 2 వేల మందితో సభలు కూడా నిర్వహించనుంది.