రష్యా అధీనంలోని అణు ప్లాంట్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

  • రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రం
  • 24 గంటల వ్యవధిలో ఐదు సార్లు డ్రోన్ దాడులు జరిగాయన్న రష్యా
  • అణు ప్లాంట్ పరిపాలనా భవనం దెబ్బతిందని వెల్లడి 
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గత కొన్ని రోజులుగా తీవ్రరూపు దాల్చింది. తాజాగా, రష్యా అధీనంలోని అణు ప్లాంట్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ అణు ప్లాంట్ జపోర్జియా ప్రాంతంలో ఉంది. 

24 గంటల వ్యవధిలో ఐదుసార్లు డ్రోన్ దాడి జరిగినట్టు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు తెలిపింది. ఈ క్రమంలో, ఉక్రెయిన్ కు చెందిన మూడు డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. వాస్తవానికి జపోర్జియా ప్రాంతం ఉక్రెయిన్ కు చెందినది. దీన్ని రష్యా ఆక్రమించింది.


More Telugu News