మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే అంశంపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

  • తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చన్న సంజయ్ రౌత్
  • తమ తమ పార్టీల కోసం ఏక్‌నాథ్, అజిత్ పవార్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరని వ్యాఖ్య
  • ఇతర పార్టీలకు సీఎం పదవి అవకాశం ఉండకపోవచ్చన్న సంజయ్ రౌత్
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారని తెలిపారు.

ఇక, తమ పార్టీ కోసం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సొంతగా నిర్ణయం తీసుకోలేరన్నారు. వీరిద్దరి పార్టీలు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కనుసన్నుల్లో నడుస్తాయన్నారు. ప్రస్తుతం బీజేపీ మెజార్టీ సీట్లు సాధించిందని, కాబట్టి కూటమిలోని ఇతర పార్టీల వారికి అవకాశం ఉండకపోవచ్చన్నారు.

మహారాష్ట్ర ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నేటితో ముగియనుంది. గడువులోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచినందున ఆ పార్టీకి అవకాశం వస్తుందని, దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News