మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే రాజీనామా.. కొనసాగుతున్న ఉత్కంఠ

  • రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించిన షిండే
  • తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకు కేర్ టేకర్ సీఎంగా కొనసాగనున్న షిండే
  • తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై వీడని సందిగ్ధత
మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్న వేళ శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే సీఎం పదవికి నేడు రాజీనామా చేశారు. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు షిండే కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 స్థానాలకు గాను 235 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అయితే, తదుపరి సీఎం ఎవరన్న దాని విషయంలో ఇంకా ఓ స్పష్టతకు రాలేకపోతోంది. 

శివసేన మాత్రం షిండేనే ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెబుతుండగా, దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఆ చాన్స్ ఉందని బీజేపీ వర్గీయులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 132 స్థానాలు గెలుచుకోగా, శివసేన, ఎన్సీపీ వరుసగా 57, 41 స్థానాల్లో విజయం సాధించాయి. 


More Telugu News