ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్ సంపద ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
- ఐపీఎల్ మెగా వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కావ్య మారన్
- కావ్య నికర ఆదాయం విలువ రూ. 409 కోట్లుగా ఉంటుందన్న 'జన్ భారత్ టైమ్స్'
- 2018 నుండి హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓగా కొనసాగుతున్న కావ్య మారన్
- ఆమె తండ్రి కళానిధి మారన్ ఇండియాలోనే అత్యంత సంపన్నులలో ఒకరు
- ఆయన నికర ఆస్తుల విలువ సుమారు రూ. 19వేల కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. రెండు రోజుల పాటు ఆమె తన జట్టు వేలానికి నేతృత్వం వహించారు. మొదటి రోజు నేవీ బ్లూ సూట్ ధరించి వచ్చిన కావ్య వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇక మొదటిసారి 2023 ఐపీఎల్ సీజన్‌లో కావ్య మారన్ బాగా హైలైట్ అయ్యారు. హైదరాబాద్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు స్టేడియానికి వచ్చి ఆటగాళ్లను ప్రోత్సహించడం చేశారు. ఆ సమయంలో ఆమె హవాభావాలు టీవీల్లో మ్యాచులను తిలకించేవారిని కట్టిపడేశాయనే చెప్పాలి. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా.. ఇదే కోవకు చెందుతారు కావ్య మారన్.
కావ్య మారన్ నికర ఆదాయం విలువ ఎంతంటే..!
కావ్య మారన్ నికర ఆదాయం విలువ దాదాపు రూ. 409 కోట్లు అని 'జన్ భారత్ టైమ్స్' తెలిపింది. ఆమె తండ్రి, సన్‌రైజర్స్ సహ యజమాని కళానిధి మారన్ ఇండియాలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. ఆయన నికర ఆస్తులు, ఆదాయం విలువ సుమారు రూ.19000 కోట్లు.
కావ్య మారన్ వ్యక్తిగత వివరాలు..
కళానిధి మారన్, కావేరి కళానిధి దంపతుల కుమార్తె కావ్య మారన్. ఆమె 1992 ఆగస్టు 6న జన్మించారు. ఆమె తండ్రి సన్ గ్రూప్ చైర్మన్. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధినేత. ఆమె తల్లి కావేరీ మారన్ సోలార్ టీవీ కమ్యూనికేషన్ సీఈఓగా ఉన్నారు. ఇండియాలో అత్యధిక వేతనం తీసుకుంటున్న మహిళల్లో కావేరీ మారన్ ఒకరు కావడం విశేషం.
కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ దివంగత మాజీ డీఎంకే అధినేత కరుణానిధి మనవడు. కావ్య మారన్ తన తండ్రి స్థాపించిన సన్ గ్రూప్‌లో చేరి వ్యాపారాన్ని విస్తృతం చేశారు. ఆసియాలోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్‌లలో సన్ గ్రూప్ కూడా ఒకటి.
కావ్య మారన్ ఎడ్యుకేషన్ ఇలా..
కావ్య మారన్ చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పట్టా పొందారు. వ్యాపార రంగంలో రాణించేందుకు వీలుగా యూకే వెళ్లి, వార్విక్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. ప్రస్తుతం సన్ నెట్‌వర్క్ వ్యాపార కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.
2018 నుండి హైదరాబాద్ ఫ్రాంచైజీ సీఈఓగా కొనసాగుతున్నారు. ఐపీఎల్ ఫ్రాంచైజీతో పాటు సన్ గ్రూప్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట ఓ జట్టును కలిగి ఉంది. గత రెండేళ్లుగా ఐపీఎల్ వేలం, మ్యాచ్‌లకు కావ్య మారన్ వస్తున్నారు.