దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణభయంతోనే భారత్‌ను వీడా: లలిత్ మోదీ

  • న్యాయపరమైన చిక్కులతో దేశం వీడలేదని వెల్లడి
  • దావూద్ ఇబ్రహీం మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకున్నాడన్న లలిత్ మోదీ
  • అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆట తనకు ముఖ్యమన్న లలిత్
దావూద్ ఇబ్రహీం నుంచి ప్రాణహాని భయంతోనే తాను భారత్‌ను వదిలి పెట్టవలసి వచ్చిందని ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ సంచలన విషయం చెప్పారు. తాను న్యాయపరమైన చిక్కుల వల్ల దేశం వీడినట్లుగా భావిస్తున్నారని, కానీ అదేమీ లేదన్నారు. దావూద్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని, తప్పనిసరి పరిస్థితుల్లో దేశాన్ని వీడాల్సి వచ్చిందన్నారు.

దావూద్ ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకున్నాడని తెలిపారు. అయితే అందులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి లేకుండా నిబద్ధతతో కూడిన ఆటే తనకు ముఖ్యమన్నారు. ఇలాంటి సందర్భంలో తనకు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.

తాను భారత్‌కు ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చట్టపరంగా మాత్రం తాను పారిపోయిన వ్యక్తిని కాదన్నారు. తనపై ఒక్క కేసూ లేదని వెల్లడించారు. లలిత్ మోదీ 2010లో భారత్‌ను వీడి వెళ్లాడు. అప్పటినుంచి లండన్‌లో ఉంటున్నాడు.


More Telugu News