జగన్ పై అభాండాలు వేస్తే.. బాలినేనికే రివర్స్ అవుతుంది: చెవిరెడ్డి ఫైర్
- వైసీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
- బాలినేని గొప్పగా అబద్ధాలు చెపుతున్నారన్న చెవిరెడ్డి
- ఎమ్మెల్సీ కోసం ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్య
వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి తనను నిద్రలేపి ఫైల్ పై సంతకాలు చేయమన్నారని ఆయన చెప్పారు. అయితే తాను సంతకం చేయలేదని... ఆ మరుసటి రోజు కేబినెట్ లో విద్యుత్ ఒప్పందాలను ఆమోదించుకున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరని చెప్పారు. బాలినేని చాలా గొప్పగా అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త పార్టీ (జనసేన) వాళ్ల మెప్పు పొందేందుకు బాలినేని ఇలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యూనిట్ కు రూ. 4.50తో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని... జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ. 2.48కి తగ్గించారని చెవిరెడ్డి తెలిపారు. అర్థరాత్రి తనను సంతకం పెట్టమన్నారని చెప్పడం బాధాకరమని అన్నారు. కేబినెట్ సమావేశంలో కొన్ని అంశాలు టేబుల్ అజెండాగా వస్తాయని... సభ్యుల ఆమోదంతో తీర్మానాలు అవుతాయని చెప్పారు.
ఏ కుటుంబం నుంచి బాలినేని ఈ స్థాయికి వచ్చారో... వారిపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో తనకు స్వేచ్ఛ లేదని బాలినేని చెప్పారని... ఇతర పార్టీల నేతలతో చార్టెడ్ ఫ్లయిట్ లో విదేశాలకు వెళ్లేంత స్వేఛ్చ ఆయనకు ఉండేదని చెప్పారు. జగన్ మీద అభాండాలు వేసి లబ్ధి పొందాలనుకుంటే... అది బాలినేనికే రివర్స్ అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే బాలినేని కోట్లు ఖర్చు పెట్టారని అందరూ అనుకుంటున్నారని చెప్పారు.