పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్‌.. జింబాబ్వే చేతిలో ప‌రాభ‌వం

  • పాకిస్థాన్‌ను 80 ప‌రుగుల తేడాతో ఓడించిన జింబాబ్వే
  • డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్రకారం జింబాబ్వేను వ‌రించిన విజ‌యం
  • సికింద‌ర్ ర‌జాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న పాకిస్థాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. తొలి వ‌న్డేలో ఆతిథ్య జట్టు చేతిలో పాక్ 80 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.2 ఓవ‌ర్ల‌లో 205 ప‌రుగులకు ఆలౌట్ అయింది. 

అనంత‌రం 206 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య‌ఛేద‌న‌కు దిగిన పాకిస్థాన్ 21 ఓవ‌ర్ల‌లో 60 ర‌న్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. అదే స‌మ‌యంలో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆపై వాతావ‌ర‌ణం ఆట‌కు అనుకూలించ‌లేదు. దాంతో 21 ఓవ‌ర్ల వ‌ద్ద జింబాబ్వే 125/7 స్థితిలో ఉండ‌టంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్రకారం విజ‌యాన్ని నిర్ణ‌యించారు. 

దీంతో డీఎల్ఎస్ ప్ర‌కారం జింబాబ్వే 80 ర‌న్స్ తేడాతో గెలిచింది. 39 ప‌రుగులు చేసి, 2 వికెట్లు తీసిన సికింద‌ర్ ర‌జాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. 


More Telugu News