ఈ ఐదూ పాటిస్తేనే.. కొలెస్ట్రాల్ టెస్ట్ లో కరెక్ట్ రిపోర్ట్!
- ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న అధిక బరువు, కొలెస్ట్రాల్ బాధితులు
- అప్పుడప్పుడూ కొలెస్ట్రాల్ స్థాయులు చెక్ చేసుకుని తగిన మందులు వాడాల్సిన తీరు
- కొన్ని అంశాలను పాటిస్తే రిపోర్టులు సరిగా వస్తాయని సూచనలు
మారిన జీవన శైలితో ఇటీవలి కాలంలో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ వంటి వాటితో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. ఇలా పెరిగిపోయిన కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, మధుమేహం సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే తరచూ కొలెస్ట్రాల్ స్థాయులను చెక్ చేసుకోవాలంటూ వైద్యులు టెస్టులు రాస్తుంటారు. మరి ఈ కొలెస్ట్రాల్ లెవల్స్ సరిగ్గా రావాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
10–12 గంటల ఫాస్టింగ్
టెస్టుకు కనీసం 10 - 12 గంటల ముందు నుంచీ ఏమీ తినకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సమయంలో హెర్బల్ టీ వంటివేవీ కూడా తీసుకోవద్దని చెబుతున్నారు. దీనివల్ల కొలెస్ట్రాల్ లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఆల్కాహాల్ కు దూరం
కొలెస్ట్రాల్ టెస్ట్ కు కనీసం 48 గంటల ముందు నుంచీ ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి. ఇంకా ఎక్కువ గ్యాప్ వస్తే మంచిదని చెప్తున్నారు.
తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి
శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు కొలెస్ట్రాల్ స్థాయుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.. టెస్టుకు ఒకరోజు ముందు నుంచీ అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి.
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి
ఏదైనా తీవ్ర మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా ప్రభావితం అవుతుంది. తప్పుడు రిజల్ట్స్ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఒత్తిడి నుంచి రిలాక్స్ కావాలి.
కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి
అధికంగా కొవ్వు ఉండే ఆహారం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. టెస్టుకు ముందు ఇలాంటి ఫుడ్ తింటే తప్పుడు రిపోర్ట్స్ రావొచ్చట.