గాయని మంగ్లీకి విశిష్ట పురస్కారం

  • తనదైన శైలిలో సాంగ్స్ పాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న మంగ్లీ
  • సంగీత నాటక అకాడమి నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపిక
  • న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని అందుకున్న మంగ్లీ
సింగర్ మంగ్లీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేటు సాంగ్స్‌తో తన కెరీర్ ప్రారంభించిన మంగ్లీ .. తన ప్రత్యేకమైన గొంతుతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది.

ఫోక్, డివోషనల్, ఐటం సాంగ్ ఇలా ఏదైనా అవలీలగా పాడుతూ ప్రేక్షకుల హృదయాలను రంజింపజేస్తోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్‌లోనూ తనదైన మార్క్ చూపిస్తుంది. జార్జి రెడ్డి సినిమాలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ.. అక్కడ నుండి తన గ్రాఫ్ అంతకంతకూ పెంచుకుంటూ వెళుతోంది. అల వైకుంఠపురం మూవీలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు అనేక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఆమెతో పాడించిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెతో సాంగ్స్ పాడించేందుకు ఎక్కువ మంది సినీ దర్శకులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సంగీత ప్రపంచానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల సంగీత నాటక అకాడమి నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆమె ఎంపికైంది. ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో ఆమె అందుకున్నారు. 


More Telugu News