ఐపీఎల్ వేలంలో వెంకటేశ్ అయ్యర్ కు ఎవరూ ఊహించని ధర
- గత సీజన్ లో కేకేఆర్ కు ఆడిన వెంకటేశ్ అయ్యర్
- ఇటీవల విడుదల చేసిన ఫ్రాంచైజీ
- ఇవాళ రూ.23.75 కోట్లతో మళ్లీ సొంతం చేసుకున్న వైనం
లెఫ్ట్ హ్యాండ్ విధ్వంసక బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ కు ఐపీఎల్ మెగా ఆక్షన్-2025లో ఊహించని ధర పలికింది. వెంకటేశ్ అయ్యర్ కనీస ధర రూ.2 కోట్లు కాగా... అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ రూ.23.75 కోట్లకు సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా పోటీపడింది. మధ్యలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఎంటర్ కావడంతో వెంకటేశ్ అయ్యర్ రేటు అమాంతం పెరిగిపోయింది.
ఇవాళ్టి వేలంలో ఇది మూడో అత్యధిక ధర. రిషబ్ పంత్ రూ.27 కోట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా... శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే, వెంకటేశ్ అయ్యర్ కు ఇంత రేటు అనవసరం అని క్రికెట్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. కేకేఆర్ ఫ్రాంచైజీ అతడి కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. వెంకటేశ్ అయ్యర్ గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకే ఆడాడు. అయితే ఇటీవల అతడిని ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఇప్పుడు భారీ ధరతో మళ్లీ సొంతం చేసుకుంది.