శ్రీకృష్ణదేవరాయలకు ఏ ఫుడ్‌ ఇష్టం... టిప్పు సుల్తాన్‌ దేన్ని ఇష్టంగా తినేవారు?

  • చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన కొందరు రాజులు
  • వారి పరాక్రమంతోపాటు వారికి ఇష్టమైన ఆహారం కూడా గ్రంథస్థం
  • తీపి పదార్థాల నుంచి బిర్యానీ దాకా విభిన్నమైన అలవాట్లు
కొందరికి మిర్చీబజ్జీలు ఇష్టం... మరికొందరికి సమోసాలు నచ్చుతాయి... ఇంకొందరు గులాబ్ జామూన్ అంటే పడి చస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకమైన వెరైటీని ఇష్టపడుతూ ఉంటారు. మరి చరిత్రలో తమకంటూ స్థానం సంపాదించిన గొప్ప గొప్పవారు ఏమేం ఇష్టపడేవారో తెలుసా? నాటి చారిత్రక గ్రంథాలు, ఇతర అంశాల ఆధారంగా కొందరికి ఇష్టమైన ఆహార పదార్థాలేమిటో గుర్తించారు. ఆ వివరాలేమిటో చూద్దామా...

  • అఖండ భారత దేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తులలో ముఖ్యుడైన అక్బర్ చక్రవర్తికి 'కిచిడీ' అంటే చాలా ఇష్టమట.
  • ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ను కట్టించిన మొఘల్ చక్రవర్తి షాజహాన్... ‘షాహీ టుక్డా’ను ఇష్టపడేవారట. ఇది ఒక రకంగా 'డబల్ కా మీఠా' (బ్రెడ్ స్వీట్) వంటిదన్న మాట.
  • మైసూర్ రాజ్యాన్ని ఏలుతూ, బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన టిప్పూ సుల్తాన్ 'మటన్ బిర్యానీ'ని అత్యంత ఇష్టంతో తినేవారట.
  • ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి తెలియనివారు ఉండరు. ఆమెపు 'పురన్ పోలి' (మనం ఉగాదికి చేసుకునే భక్ష్యాలు) ని బాగా ఇష్టపడేవారట.
  • పంజాబ్ రాజ్యాన్ని ఏలిన మహరాజా రంజిత్ సింగ్ కు 'దాల్ మఖానీ' అంటే చాలా ఇష్టమట. తమ రాచ వంటశాలలో రోజూ దానిని తప్పనిసరిగా వడ్డించాల్సిందేనట.
  • మేవార్ రాజు మహారాణా ప్రతాప్ 'భాటీ'గా పిలిచే రాజస్థానీ వంటకాన్ని చాలా ఇష్టంగా తినేవారట. 
  • ఒకప్పుడు దక్షణ భారతదేశాన్ని ఏలిన చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు... ‘కుళి పనియారం’గా పిలిచే తమిళ వంటకాన్ని ఇష్టంగా తినేవారట. ఇవి పునుగుల వంటివే అనుకోవచ్చు.
  • చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్... 'జర్దా పలావ్' గా పిలిచే తీపి అన్నం వంటకాన్ని బాగా ఇష్టపడేవారట.
  • ఇక మనకు ఎంతో ఇష్టుడైన విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు... 'చింతపండు పులిహోర'ను అత్యంత ఇష్టంతో తినేవారట.


More Telugu News