పెర్త్ టెస్టు.. జైస్వాల్ ఔట్.. 400 దాటిన భారత్ ఆధిక్యం
- పెర్త్ వేదికగా భారత్, ఆసీస్ తొలి టెస్టు
- భారీ సెంచరీ (161)తో ఆకట్టుకున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్
- ఇప్పటికే 400 దాటిన టీమిండియా ఆధిక్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ శతకం(161) బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న యువ ఆటగాడికి ప్రేక్షకులు, ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం గమనార్హం.
ఇక ఓవర్‌నైట్ స్కోర్ 172/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ధాటిగా ఆడింది. అయితే, ఓపెనర్లు రాహుల్ (77), జైస్వాల్ (161) పెవిలియన్ చేరిన తర్వాత టీమిండియా తడబడింది. స్వల్ప విరామాల్లో వరుసగా పడిక్కల్ (25), పంత్ (01), ధ్రువ్ జురేల్ (01) వికెట్లను పారేసుకుంది. మరోవైపు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత క్రీజులో కుదురుకోవడం శుభసూచకం. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (41), వాషింగ్టన్ సుందర్ (14) ఉండగా.. భారత్ స్కోర్ 360/5 (112 ఓవర్లు). ఇప్పటికే భారత్ ఆధిక్యం 400 దాటింది.