కెన్యా ఎయిర్‌పోర్టు నియంత్రణ ఒప్పందంపై స్పందించిన అదానీ గ్రూప్

  • అదానీ గ్రూప్‌తో 2.5 బిలియన్ డాలర్లకుపైగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన కెన్యా
  • దీనిపై వివరణ ఇవ్వాలంటూ అదానీ గ్రూప్‌ను ఆదేశించిన స్టాక్ ఎక్స్‌చేంజీలు
  • అది సెబీ బహిర్గత నిబంధనల పరిధిలోకి రాదనే వెల్లడించలేదన్న అదానీ గ్రూప్
  • కెన్యా విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్న అదానీ గ్రూప్
భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం అభియోగాలు నమోదైన తర్వాత అదానీతో కుదుర్చుకున్న 2.5 బిలియన్ డాలర్లకుపైగా ఒప్పందాలను రద్దు చేసుకున్నట్టు కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. కెన్యా ప్రకటనపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది. కెన్యాలోని ప్రధాన విమానాశ్రయ నిర్వహణకు సంబంధించి అక్కడి ప్రభుత్వంతో తాము ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేసింది.

విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం, 30 ఏళ్లపాటు వాటి నిర్వహణకు సంబంధించిన ఒప్పందంపై మాత్రమే గత నెలలో సంతకం చేసినట్టు తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టు సెబీ బహిర్గత నిబంధనల పరిధిలోకి రాదని, కాబట్టి దీనిని వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నియంత్రణ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కెన్యా అధ్యక్షుడు విలియం రూటో ఆదేశించిన నివేదికలను ధ్రువీకరించేందుకు స్టాక్ ఎక్స్‌చేంజీలు పంపిన నోటీసులకు అదానీ గ్రూప్ ఇలా బదులిచ్చింది.

గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఈ ఏడాది ఆగస్టులో కెన్యా విమానాశ్రయాలను అప్‌గ్రేడ్ చేసేందుకు, ఆధునికీకరించేందుకు, నిర్వహించేందుకు స్టెప్‌డౌన్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్టు ఫైలింగ్‌లో పేర్కొంది. 


More Telugu News