ఉత్కంఠ పోరులో నాందేడ్ లోక్ సభ సీటును నిలుపుకున్న కాంగ్రెస్
- కాంగ్రెస్ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్ రావు విజయం
- 1,457 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఓటమి
- తీవ్ర ఉత్కంఠ రేపిన నాందేడ్ లోక్ సభ ఫలితం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు బీజేపీయే గెలుచుకుంది. ఉప ఎన్నికలతో పాటు వయనాడ్, నాందెడ్ లోక్ సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. వయనాడ్ నుంచి ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేసి 4 లక్షల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.
నాందేడ్ లోక్ సభ పోరు ఫలితంలో మాత్రం నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. రౌండ్ రౌండ్‌కు పార్టీల ఆధిక్యం మారిపోయింది. పైగా మెజార్టీ చాలా తక్కువగా ఉంది. దీంతో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కనిపించింది. ఈ ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చవాన్ రవీంద్ర వసంత్ రావు సమీప బీజేపీ అభ్యర్థి సంతుక్ రావ్ మారోత్ రావ్‌పై 1,457 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 5,86,788 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 5,85,331 ఓట్లు వచ్చాయి. 2024లో సాధారణ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. అయితే ఈసారి బీజేపీ ఓట్ల శాతం 3 శాతానికి పైగా పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ 2 శాతానికి పైగా తగ్గింది. ఓ సమయంలో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచిందని భావించారు. కానీ రౌండ్ రౌండ్‌కి మెజార్టీ తారుమారయ్యింది.