వాయనాడ్‌లో భారీ మెజారిటీతో ప్రియాంక గాంధీ విజయం... అన్న రికార్డుకు చేరువలోకి వచ్చిన చెల్లెలు
- వయనాడ్ లోక్ సభ బై పోల్స్ విజేత ప్రియాంక గాంధీ
- 4.08 లక్షల ఓట్ల బంపర్ మెజారిటీతో గెలుపు
- గతంలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ పేరిట అత్యధిక మెజారిటీ రికార్డు
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించారు. సమీప సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై బంపర్ మెజారిటీతో గెలుపొందారు. 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు.
అయితే, ఇక్కడ అత్యధిక ఓట్ల మెజారిటీ రికార్డు ప్రియాంక సోదరుడు రాహుల్ గాంధీ పేరిట ఉంది. రాహుల్‌గాంధీ 2019లో సాధించిన 4.30 లక్షల ఓట్ల మెజారిటీయే ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ. అయితే, రాహుల్ గాంధీ ఇటీవలి (2024) ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీ మాత్రమే పొందారు. ఇప్పుడు 4.08 లక్షల ఓట్ల మెజారిటీతో ప్రియాంక... తన అన్నయ్య రాహుల్ గత మెజారిటీ (3.64 లక్షలు)ని అధిగమించారు.