మంచు విష్ణుకి 'క‌న్న‌ప్ప' టీమ్ బ‌ర్త్‌డే విషెస్

  • నేడు హీరో మంచు విష్ణు పుట్టిన‌రోజు
  • 'మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు!" అంటూ ట్వీట్  
  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో వ‌స్తున్న‌ 'క‌న్న‌ప్ప'
నేడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు క‌న్న‌ప్ప మూవీ టీమ్ ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పెష‌ల్‌ పోస్ట్ చేసింది. 

"డైనమిక్ స్టార్ మంచు విష్ణుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అచంచలమైన అంకితభావం, అభిరుచి మా అందరికీ స్ఫూర్తినిస్తుంది. మీరు కన్నప్ప సినిమాకు ప్రాణం పోస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు. మీ అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు!" అంటూ చిత్ర‌బృందం ట్వీట్ చేసింది. 

ఇదిలాఉంటే.. మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా క‌న్న‌ప్ప‌. ఈ చిత్రంలో మోహ‌న్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజ‌ల్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. 

ఈ మూవీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ సినిమాలోని కీల‌క పాత్ర‌ల తాలూకు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసి, క‌న్న‌ప్ప‌పై భారీ హైప్ క్రియేట్ చేశారు.


More Telugu News