కిస్సిక్ సాంగ్ ప్రోమో.. వీడియో ఇదిగో!

--
పుష్ప 2 సినిమా టీమ్ నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఈ నెల 24 (ఆదివారం) కిస్సిక్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్.. తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ వచ్చే నెల 5న థియేటర్లకు రానున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా భారీ విజయం నమోదు చేయడంతో సెకండ్ పార్ట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 లో శ్రీలీల స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ ను ఆదివారం విడుదల చేయనున్నట్లు సినిమా టీమ్ తెలిపింది. ఈ సాంగ్ కు సంబంధించి తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోను మీరూ చూసేయండి.


More Telugu News