పెర్త్ టెస్టులో ఆల్ టైమ్ రికార్డ్ సాధించిన రిషబ్ పంత్.. డబ్ల్యూటీసీ చరిత్రలో తొలిసారి
- డబ్ల్యూటీసీ చరిత్రలో 2000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు
- పెర్త్ టెస్టులో 37 పరుగులతో ఫర్వాలేదనిపించిన స్టార్ బ్యాటర్
- పంత్ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్
ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకు, ఆతిథ్య ఆస్ట్రేలియా 104 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్ ముగింపు నాటికి భారత్‌కు స్వల్ప ఆధిక్యం లభించినా ఫలితాన్ని తేల్చే రెండవ ఇన్నింగ్స్‌లో ఎవరు ఆధిపత్యాన్ని సాధిస్తారో చూడాలి.
కాగా పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులు సాధించిన భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఒక ఆల్‌టైమ్ రికార్డు సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (డబ్ల్యూటీసీ) 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన ఏకైక క్రికెటర్ పంత్ కావడం విశేషం. ప్రస్తుతం 2,034 పరుగులతో డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు. 1,930 పరుగులతో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో నిలిచాడు.
ఇక డబ్ల్యూటీసీలో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ (2,685), విరాట్ కోహ్లి (2,432) తర్వాత రిషబ్ పంత్ మూడవ స్థానంలో నిలిచాడు. కాగా పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ టాపార్డర్ దారుణంగా విఫలమయ్యారు. అయితే పంత్ 37 పరుగులు సాధించి కాస్త ఫర్వాలేదనిపించాడు. భారత్ 150 పరుగుల స్కోరును చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా 41 పరుగులు సాధించడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరుని అందుకుంది.