ఝార్ఖండ్ లో నువ్వా.. నేనా ? క్షణానికోసారి మారుతున్న ట్రెండ్స్

  • ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ 
  • ఆధిక్యంలో మెజారిటీ మార్కు దాటేసిన ఇండియా కూటమి
  • బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వెనుకంజ
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణానికోసారి ట్రెండ్స్ మారుతుండడంతో ఎన్డీయే, ఇండియా కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైన కౌంటింగ్.. పది గంటల వరకు ఇరు కూటముల మధ్య ఆధిక్యం మారుతూ వచ్చింది. కాసేపు ఎన్డీయే కూటమి లీడ్ లో ఉండగా, మరికాసేపు ఇండియా కూటమి లీడ్ లోకి దూసుకొచ్చింది.

పదిన్నరకు ప్రస్తుత ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ఆధిక్యంలో మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 సీట్ల (మ్యాజిక్ ఫిగర్) లో గెలవాల్సి ఉండగా.. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులు ప్రస్తుతం 51 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఓ దశలో 39 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన ఎన్డీయే కూటమి తాజాగా 28 స్థానాలకు పడిపోయింది. అయితే, ఇంకా కౌంటింగ్ చాలా వుంది కాబట్టి, ట్రెండ్ మారే అవకాశం ఉందని, తమ కూటమే గెలుస్తుందని ఎన్డీయే నేతలు ఆశాభావంతో ఉన్నారు.


More Telugu News