కరుడు గట్టిన వేటగాళ్ల అరెస్ట్.. చిరుత చర్మం, 5 కేజీల మాంసం పట్టివేత
- కోక్రాఝర్ నేషనల్ పార్క్‌లో ఘటన
- చాలా కాలంగా అడవి జంతువులను చుట్టుపక్కల దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు
- అరుదైన జంతువులకు కోక్రాఝర్ నేషనల్ పార్క్ ప్రసిద్ధి
అస్సాం, కోక్రాఝర్‌లోని రాయ్ మోనా నేషనల్ పార్క్‌లో ఓ చిరుతను చంపి దాని చర్మాన్ని వలిచి, శరీర భాగాలను వేరు చేసి స్మగ్లింగ్‌కు రెడీ అయిన ముగ్గురు వేటగాళ్లను అస్సాం అటవీశాఖ అధికారులు, సహస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) సిబ్బంది అరెస్ట్ చేశారు. వారి నుంచి చిరుత చర్మం, 5 కేజీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వీరు కరుడుగట్టిన వేటగాళ్లని, చాలా కాలంగా వీరు పులులు, ఏనుగులు, దుప్పిలు వంటి వాటిని చంపి వాటి శరీర భాగాలను చుట్టుపక్కల దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో ఉన్న రాయ్ మోనా నేషనల్ పార్క్ ఆసియా ఏనుగులు, శరీరంపై బూడిద, పసుపు రంగు వలయాలు ఉండే చిరుతలు (క్లౌడెడ్ లెపార్డ్), బెంగాల్ టైగర్, అడవి దున్న, మచ్చల జింక (చితాల్) వంటి వాటికి ప్రసిద్ధి.