రామచంద్రపురం సీఐపై అధికారుల వేటు
- ఓ సామాజికవర్గ వన సమారాధనలో ప్రసంగించిన సీఐ అశోక్ కుమార్
- అశోక్ కుమార్ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్
- సీఐను విఆర్‌కు పంపుతూ ఆదేశాలు
పలువురు అధికారులు అనాలోచితంగా చేసే చర్యలు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. విధి నిర్వహణలో వుండే ప్రభుత్వ అధికారులు ఇతరుల మాదిరిగా మాట్లాడకుండా కొన్ని నియమాలు పాటించాలి. ఇక ప్రస్తుతం ఎవరైనా బహిరంగ వేదికలపై ఏదైనా మాట్లాడితే వెంటనే ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులపై వేటు పడుతోంది. తాజాగా ఓ సామాజిక వర్గ వన సమారాధనలో పాల్గొన్న పోలీస్ అధికారి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపుతూ వేటు వేశారు.
విషయంలోకి వెళితే.. ప్రసుతం ఉభయ గోదావరి జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సీఐ కె అశోక్ కుమార్ ఓ సామాజిక వర్గం నిర్వహించిన వన సమారాధనలో పాల్గొని చేసిన ప్రసంగం చర్చనీయాంశమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయనను విఆర్‌కు పంపుతూ ఆదేశాలు ఇచ్చారు.
ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. ‘మనల్ని మనం నిరూపించుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది. మీ ఇగోలతో పిల్లల భవిష్యత్తు పాడుచేయొద్దు. రాజకీయం వేరు, కులం వేరు. ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కులాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి. నేను సర్వీసులోకి వచ్చి పన్నెండేళ్లయింది. నా అనుభవంతో చెబుతున్నా. అగ్రకులాల్లో భార్యభర్తల గొడవ జరిగినా వివాదం బయటకు రాకుండా ఫోన్లలోనే పరిష్కరించుకుంటారు. ఇతర కులాల్లోనూ కుటుంబ తగవులుంటే మా వరకు రావు. అదే మన సామాజికవర్గంలో అయితే అది వెంటనే ఊరంతా తెలుస్తుంది. ఇలాంటివి మానుకొని గోప్యత పాటించాలి’ అని చెప్పుకొచ్చారు.
అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అధికారి రాజకీయ నాయకులతో వేదిక పంచుకోవడమే కాక, సామాజిక నాయకుడి మాదిరిగా మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. ఈ విషయాన్ని తాళ్లపాలెం సర్పంచ్ కట్టా గోవింద్ శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిశీలకుడు, ఐఏఎస్ అధికారి కె హర్షవర్థన్ దృష్టికి తీసుకువెళ్లాడు. మరో పక్క సీఐ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆయనను విఆర్‌కు పంపుతూ ఐజీ ఆదేశాలు ఇచ్చారని జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు.