అదానీ, జగన్ వ్యవహారంపై చంద్రబాబు స్పందన
- ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారన్న చంద్రబాబు
- అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ తమ వద్ద ఉందన్న ముఖ్యమంత్రి
- ఈ అంశాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని వెల్లడి
అమెరికా కోర్టులో అదానీ సహా 8 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా వినిపించడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వాధినేతకు రూ. 1,750 కోట్ల ముడుపులు అందాయనే వార్త ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ శాసనసభలో పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశంపై మాట్లాడారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను జగన్ నాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి ఉందని అన్నారు. అమెరికా కోర్టులో వేసిన ఛార్జిషీట్ తమ వద్ద ఉందని చెప్పారు. దీనిని అధ్యయనం చేసి, మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తామని తెలిపారు.
ఈ అంశాన్ని తమ ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని చెప్పారు. చరిత్రలో ఏ నాయకుడు చేయని తప్పులను ముఖ్యమంత్రిగా జగన్ చేశారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం బరితెగించి తప్పులు చేసిందని... ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించిందని విమర్శించారు.