నాగచైతన్య-శోభిత పెళ్లి... ఈ వేడుక గురించి నాగార్జున ఆసక్తికర అప్‌డేట్
- డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చైతూ-శోభిత పెళ్లి
- వివాహం చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు తెలిపిన నాగ్
- ఈ పెళ్లి వేడుకకు 300 మందిని మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయం
- స్టూడియోలో వేసిన అందమైన సెట్‌లో వివాహ వేడుక
నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతోంది. ఇప్పటికే పెళ్లి పనులు జోరు అందుకున్నాయి.
ఇక ఈ పెళ్లి వేడుక గురించి నాగార్జున తాజాగా ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. వివాహం చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు తెలిపారు. చైతూ కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
స్టూడియోలో వేసిన అందమైన సెట్‌లో ఈ జంట ఒక్కటి కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలిపారు. నాగచైతన్య-శోభిత వివాహానికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని, ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదన్న నాగ్.. తమ కుటుంబ వారసత్వంలో ఒక భాగమని పేర్కొన్నారు.
ఈ స్టూడియోస్ తన నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక పెళ్లి తర్వాత జరిగే రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు అతి త్వరలోనే తెలియజేస్తామని నాగార్జున పేర్కొన్నారు.