73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • భారత్ లైనప్ ను కూల్చిన స్టార్క్, హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్
  • 5 పరుగులకే ఔట్ అయిన కోహ్లీ
  • ప్రస్తుత స్కోరు 45 ఓవర్లలో 121 పరుగులు  
పెర్త్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్ తడబడుతోంది. కంగారూల బౌలింగ్ ను ఎదుర్కోవడంలో భారత్ బ్యాట్స్ మెన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 73 పరుగులకే 6 వికెట్లను కోల్పోయిన దశలో రిషభ్ పంత్, తెలుగు తేజం నితీశ్ రెడ్డి ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. 

మిచెల్ స్టార్క్, హేజిల్ వుడ్, మిచెల్ మార్ష్ లు భారత్ లైనప్ ను కుప్పకూల్చారు. వీరి బౌలింగ్ ధాటికి జైశ్వాల్ (0), కేఎల్ రాహుల్ (26), దేవదత్ (0), కోహ్లీ (5), జురేల్ (11), వాషింగ్టన్ సుందర్ (4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. రిషభ్ పంత్ 37 పరుగులతో, నితీశ్ రెడ్డి 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు.


More Telugu News