ఆసీస్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో చెప్పిన రవిశాస్త్రి
- నేడు పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్
- రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న బుమ్రా
- బుమ్రాకు కీలక సూచనలు చేసిన మాజీ కెప్టెన్ రవిశాస్త్రి
ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ పట్టికలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఇరుజట్లు పోటాపోటీగా తలపడేందుకు సిద్దమయ్యాయి. శుక్రవారం ఉదయం 7.50 గంటలకు తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో సారథ్యం వహిస్తున్న జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో తనదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. పెర్త్ మైదానంలో ఘనమైన రికార్డు లేని టీమిండియా ఈసారి విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని భావిస్తోంది. ఈ తరుణంలో బుమ్రాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలని చూస్తారని రవి శాస్త్రి హెచ్చరించారు. ఒకవేళ అలా చేయగలిగితే జట్టు కూడా కాన్ఫిడెన్స్ కోల్పోతుందని వాళ్ల నమ్మకమన్నారు. అందుకని బుమ్రా వాళ్ల వ్యూహంలో పడిపోవద్దని సూచించారు. అతడు ఒక పేసర్‌ను అనే ఆలోచనతోనే బౌలింగ్ చేయాలని అలా చేస్తేనే కెప్టెన్‌గా విజయం సాధించగలడని రవిశాస్త్రి పేర్కొన్నారు.